ఏపీ ఆర్టీసీలో త్వరలోనే కారుణ్య నియమాకాలు… 1800 కుటుంబాలకు ఉద్యోగాలు

-

త్వరలోనే ఏపీ ఆర్టీసీలో కారుణ్య నియామకాలు చేస్తాం అని మంత్రి పేర్ని నాని వెల్లడించారు. 1800 కుపైగా ఉన్న కుటుంబాలకు కారుణ్య నియామకాల వల్ల లబ్ది చేకూరనుంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో వారికి ఉద్యోగాలు కల్పిస్తామని పేర్ని నాని వెల్లడించారు. సంబంధిత జిల్లాల్లోనే వారికి ఉద్యోగాలు ఇస్తామని వెల్లడించారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు త్వరలోనే మరణించి ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇస్తామని అన్నారు. గ్రామ, వార్డు సచివాలయాతో పాటు ఆర్టీసీ, జిల్లా కలెక్టర్ దగ్గర ఉన్న సుమారు 40 డిపార్ట్ మెంట్లలో ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో తెలుసుకుని ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఏ జిల్లాలో ఆర్టీసీ ఉద్యోగస్తుడు మరణిస్తే.. ఆ జిల్లాలోనే ఉద్యోగం ఇవ్వాలని సీఎం ఆదేశించారని అన్నారు. ఇప్పటికే మరణించిన ఆర్టీసీ ఉద్యోగుల లిస్టు…ఎవరైతే ఉద్యోగాలకు అప్లై చేసుకున్నారో వారందరి లిస్టులను కలెక్టర్లకు పంపించామని త్వరలోనే కారుణ్య నియామకాలు జరుగుతాయని పేర్ని నాని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version