సీఎం జగన్ పై దాడి…కోడికత్తి 2.0 వెర్షన్ అంటూ టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కౌంటర్ ఇచ్చారు. కోడికత్తి డ్రామా 2.0 వెర్షన్ గులకరాయి దాడి అని.. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి ప్రజలనుంచి స్పందన కరువవడంతో కోడికత్తి 2.0కి తెర లేపారని ఆగ్రహించారు. ముఖ్యమంత్రి పర్యటన జరుగుతుంటే కరెంటు తీసేయడం ముందుగా వేసుకున్న పథకంలో భాగం కాదా? ఇది ఉద్దేశపూర్వకంగా చేయించుకున్న దాడేనన్నారు.
డీజీపీ, ఇంటిలిజెన్స్ ఐజి నేతృత్వంలో రూపొందించిన డ్రామా ఇదని.. 2019 ఎన్నికలకు ముందుకు విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన కోడికత్తి డ్రామాకు, సింగ్ నగర్ లో సిఎంపై జరిగిన గులకరాయి దాడికి పెద్ద తేడా ఏమీ లేదని ఆగ్రహించారు. సంఘటన జరిగిన నిమిషాల వ్యవధిలోని జగన్ అండ్ కో పేర్నినాని, అంబటి రాంబాబు లైన్ లోకి వచ్చి ఇదంతా చంద్రబాబు చేయించాడని ప్రచారం చేయడం ముందస్తు ప్రణాళికలో భాగం కాదా? ఎన్ని నాటకాలు ఆడినా ఇప్పటికే ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపేందుకు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. కాలం చెల్లిన ఇటువంటి డ్రామాలు నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరన్న విషయాన్ని జగన్ గుర్తించాలన్నారు అచ్చెన్నాయుడు.