అఖిలప్రియ అరెస్ట్… కథ క్లైమాక్స్ కి వచ్చినట్లేనా?

-

గతకొన్ని రోజుల క్రితం ఏవీ సుబ్బారెడ్డి – అఖిల ప్రియల మధ్య జరిగిన వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తనను హత్య చేయించాలని అఖిలప్రియ భావించిందని.. అందుకు కొందరు కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చిందని.. పోలీసుల విచారణలో ఆ కిరాయి హంతకులు అఖిల ప్రియ పేరు చెప్పారని అప్పట్లో ఏవీ సుబ్బారెడ్డి తెలిపిన సంగతి తెలిసిందే. దీంతో అఖిల ప్రియను అరెస్టు చేయబోతున్నారంటూ కథనాలు వచ్చాయి. ఆ పని ఇంకా జరగకపోయే సరికి ఏవీ సుబ్బారెడ్డి ఎస్పీని కలిశారు!

ఏపీ సీడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మైన్, టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి, ఆయన కుమార్తె జస్వంతి రెడ్డిలు జిల్లా ఎస్పీ అన్బురాజన్‌ ను కలిశారు. తనను హతమార్చేందుకు కుట్ర పన్నిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్ రాం‌ లను త్వరగా అరెస్టు చేయాలని విజ్ఞప్తి చేశారు. తనకు వారి నుంచి ప్రాణహాని ఉందని తెలిపినా.. కుట్రకు ఖచ్చితమైన బాధ్యులు వారని తెలిసినా.. అరెస్ట్ లో జాప్యం ఎందుకని ఏవీ సుబ్బారెడ్డి పోలీసులను ప్రశ్నించారు.

దీంతో వ్యవహారం క్లైమాక్స్ కి వచ్చినట్లేనని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. ఎవీ సుబ్బారెడ్డి విషయంలో హత్యకు కుట్రపన్నారనే వ్యవహారంలో అఖిలప్రియ పేరు పోలీసుల వద్ద ఆల్ మోస్ట్ కన్ ఫాం అనేది అప్పట్లో వచ్చిన వార్తల సారాంశం. ఆ విషయం జరిగి ఇంతకాలమైనా పోలీసులు చర్యలు తీసుకోలేదు. దాంతో మరోసారి ఏవీ నేరుగా ఎస్పీని కలిసి ప్రశ్నించడంతో వ్యవహారం క్లైమాక్స్ కి వచ్చినట్లేనని.. ఏక్షణమైనా అఖిల ప్రియను అరెస్టు చేయొచ్చనే గుసగుసలు వినిపిస్తున్నాయి!

Read more RELATED
Recommended to you

Exit mobile version