జగన్ శతృవుపై వైకాపా ఇన్ చార్జ్ కి ప్రేమేంటి?

-

మామూలుగా ఆంధ్రజ్యోతి పత్రిక అంటే… వైకాపా నేతలకే కాదు, వైకాపా కార్యకర్తలకే కాదు, జగన్ ని అభిమానించే ప్రతీ ఒక్కరికీ అయిష్టం అనే చెప్పాలి! జగన్ కు వ్య్యతిరేకంగా వారు అందించే అడ్డగోలు కథనాలు.. పాదయాత్ర సమయంలోనే కాకుండా, జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నన్నాళ్లూ టీడీపీ అనుకూల మీడియా ఏ రేంజ్ లో ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లుగా కనికట్టు చేసినట్లు వార్తలు అందించిందో అందరికీ తెలిసిన విషయమే. నాడు మొదలెట్టిన ఈ అడ్డగోలు రాతలు.. నేటికీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కరోనా పాజిటివ్ కేసుల విషయంలో కూడా ప్రతీరోజూ టెస్టుల సంఖ్య అనే ఊసే లేకుండా… కేసులు పెరుగుతున్నాయి, కేసులు పెరుగుతున్నాయి అంటూ ఒకే మాట చెబుతూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేయడంతోపాటు, వారిని తప్పుదోవపట్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి సందర్భంలో ప్రకాశం జిల్లా అద్దంకి వైసీపీ ఇన్ చార్జి బాచిన చైతన్య తన పుట్టిన రోజున ఆంధ్రజ్యోతికి పెద్ద ఎత్తున అడ్వటైజ్ మెంట్లు ఇవ్వడం కలకలం రేపింది.

ప్రభుత్వ ప్రైవేటు కార్యక్రమాలకు ఆంధ్రజ్యోతి జర్నలిస్టులు పాల్గొనకుండా సీఎం జగన్ బ్యాన్ చేశారు. వైసీపీ అధినేత జగన్ అంత ఖరాఖండీగా ఆంధ్రజ్యోతి విషయంలో వ్యవహరిస్తున్నారు. ఇదే క్రమంలో కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు, మరికొంతమంది ఇన్ చార్జిలు, వైసీపీ కేడర్… వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మొత్తం ఆంధ్రజ్యోతి మీడియాని వెలివేశారు. దీంతో దెబ్బకు ఆంధ్రజ్యోతి ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక స్టాఫ్ ను కూడా తీసివేయాల్సిన పరిస్థితికి వచ్చింది. ఈ పరిస్థితుల్లో అన్నీ తెలిసి కూడా ఈ బాచిన కృష్ణ చైతన్య… ఆంధ్రజ్యోతి వాళ్లకు నెలకు కప్పం కట్టినట్టు కొంత సహాయం చేస్తున్నారు అని వినికిడి.

దీంతో… వైకాపా కి ఆంధ్రజ్యోతికి మధ్య ఇంత విభేదాలున్నా కూడా… వైసీపీ నేతలు ఆంధ్రజ్యోతికి అడ్వటైజ్ మెంట్లు ఎలా ఇస్తారు అని ప్రకాశం జిల్లా వైసీపీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. జగన్ ని అడ్డగోలుగా తిడుతున్న మీడియాకు ప్రకటనలు ఇవ్వడం అంటే కన్నతల్లి రొమ్ము గుద్దినట్టేనని స్థాయిలో వైసీపీ వర్గాలు విమర్శిస్తున్నాయి. మరి ఇప్పటికైనా ఈ వైసీపీ నేత తీరు మార్చుకుంటారో లేక ఆంధ్రజ్యోతిపై అంతే ప్రేమను కనబరుస్తాడో చూడాలి మరీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version