సాయిశ్వరుడు హత్య కేసులో కోర్టు ముందుకు ఇవాళ హాజరుకానున్నాడు వైసీపీ నేత బైరెడ్డి సిద్దార్థరెడ్డి. విజయవాడలోని ప్రజా ప్రతినిధుల కోర్టుకు హాజరుకానున్నాడు. బైరెడ్డి సిద్దార్థ రెడ్డి తో పాటు కోర్టుకు హాజరుకానున్న నిందితులు నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి, ఆయన సోదరుడు బైరెడ్డి మల్లికార్జున రెడ్డి నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం ముచ్చుమర్రి గ్రామానికి చెందిన సాయీశ్వరుడు హత్యకేసులో నిందితులుగా ఉన్నారు ప్రస్తుతం ఏపీ శాప్ చైర్మెన్ గా విధులు నిర్వహిస్తున్నాడు బైరెడ్డి సిద్దార్థరెడ్డి. సాయీశ్వరుడు హత్య కేసుపై ఈరోజు విచారించనున్న ప్రజా ప్రతినిధుల కోర్టు న్యాయమూర్తి.
ఇవాళ విజయవాడ కోర్టు ముందుకు హాజరు కానున్న నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది. కోర్టు ఇవాళ ఏం తీర్పు చెబుతుందనేది అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కోర్టు కేసులో ఈ సమస్య పరిష్కారం అవుతుందా అని నిందితుడి తరపు వారు.. శిక్ష పడకుండా బైరెడ్డి జాగ్రత్తలు తీసుకునేటట్టు కనిపిస్తోంది. ఈ రోజు కోర్టులో ఏం జరుగుతుందనేది వేచి చూడాలి మరీ.