ఏపీ విద్యార్థులకు శుభవార్త. శాసనమండలిలో మంత్రి డా. డోలా బాల వీరాంజనేయస్వామి కీలక ప్రకటన చేశారు. నిత్యవసర ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. మెస్ చార్జీలకు బడ్జెట్ లో ఈ ఏడాదికి రూ.135 కోట్లు కేటాయించామన్నారు. గత ప్రభుత్వం 2023 – 24 కి పెట్టిన బకాయి రూ. 50 కోట్లు మేం చెల్లించాం , మరో రూ. 54 కోట్లు డిసెంబర్ లో చెల్లిస్తామని పేర్కొన్నారు. విద్యార్దులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకాలానికి మెస్ చార్జీలు విడుదల చేస్తామని ప్రకటన చేశారు.
దళితులను చంపి డోర్ డెలివరీ చేసిన వాళ్ళు, శిరోముండనం చేసిన వాళ్లు దళిత సంక్షేమం గురించి మాట్లాడడం సిగ్గుచేటు అంటూ ఆగ్రహించారు. జగన్ దళితులకు మేనమామనంటూ వారిని మోసం చేశారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం వసతి దీవెనకి 2020 – 21 లో 100 కోట్లు కేటాయించి ఖర్చు చేసింది కేవలం రూ. 21 కోట్లే అన్నారు. కేటాయించిన నిధుల్లో కనీసం 25 శాతం కూడా ఖర్చు చేయలేదని తెలిపారు మంత్రి డా. డోలా బాల వీరాంజనేయస్వామి.