ఒంగోలులో మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఒంగోలులో పేదలకు ఇళ్ల పంపిణీలో నేను అవినీతికి పాల్పడ్డానని నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని పేర్కొన్నారు. 25వేల మందికి జగనన్న ఇళ్ల పట్టాలు పంపిణీకి రంగం సిద్దం చేస్తే,టిడిపి వాళ్ళు కోర్టులో కేసులు వేసి అడ్డుకున్నారని ఆగ్రహించారు. ప్రజల సొమ్ము ప్రజలకు పంచుతుంటే టిడిపికి కోర్టులో కేసులు వేయడం ఏంటి అని ప్రశ్నించారు.
మళ్లీ 500 కోట్లతో 200 ఎకరాల భూమిని ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం కొన్నదని చెప్పారు. త్వరలో ఒంగోలులోని 25వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ సీఎం జగన్ చేతుల మీదుగా పంపిణీకి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. పేదలకు పంచే ఇళ్ల పట్టాల పంపిణీలో నేను సంపాదించాలనుకుంటే 500 కోట్లలో 50 కోట్లు సంపాదించుకోవచ్చు.. కానీ నేను సింగిల్ రూపీ కూడా ముట్టుకోలేదని పేర్కొన్నారు. గతంలో ఒంగోలులో టిడ్కో ఇళ్ల విషయంలో భారీ అవినీతి జరిగింది..ప్రజల నుంచి 14 వేల మందితో డబ్బులు కట్టించుకొని 4వేల మందికి టిడ్కో ఇళ్లను ఇచ్చారు.. మిగిలిన డబ్బుల టిడిపి వాళ్లు వాడుకున్నారని ఫైర్ అయ్యారు బాలినేని.