తనను అరెస్ట్ చేయాలని ప్రభుత్వం కుట్రలు పన్నుతోంది.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

-

తనను అరెస్ట్ చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ కుట్రలు పన్నుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నామని తెలిపారు. వారి సూచనల మేరకు ఈడీ ఎదుట విచారణకు హాజరు అవుతానని క్లారిటీ ఇచ్చారు. తనపై ఏసీబీ, ఈడీలు పెట్టిన కేసులు అన్నీ తప్పుడు కేసులే అని కొట్టి పడేశారు. తనను ఎలాగౌనా అరెస్ట్ చేయాలని రేవంత్ ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని ఆరోపించారు.

అరెస్ట్ లు, కేసులకు బీఆర్ఎస్ పార్టీ నేతలు బయపడరు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. మరోవైపు సీఎం రేసులో కేటీఆర్, కవిత ఉన్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. తమ సీఎం అభ్యర్థి గా ఎప్పటికీ కేసీఆరేనని వెల్లడించారు. రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డికి తగిన గుణపాఠం చెబుతామని.. రాష్ట్రంలో పరిణామాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని కేటీఆర్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version