విజయమ్మ నిర్ణయం ప్రకారం జగన్, షర్మిల నడుచుకోవాలి – బాలినేని

-

విజయమ్మ జడ్జిమెంట్ ప్రకారం జగన్ షర్మిల నడుచుకోవాలని కోరారు బాలినేని. ఎన్నికలకు ముందే నిన్ను పార్టీలోకి తీసుకోవాలని అనుకున్నానని పవన్ కళ్యాణ్ అన్నారని… బంధువులు అవుతారు మిమ్మల్ని పార్టీలోకి తీసుకుని చీల్చడం ఇష్టం లేదన్నారని తెలిపారు. నేను వైసీపీలో ఉన్నప్పుడు కూడా ఆయన నన్ను మెచ్చుకున్నారన్నారు. నాకు ఎక్కడ అన్యాయం జరిగిందో.. ఏం జరిగిందో ఒంగోలు ప్రజలకు తెలుసు అని వివరించారు. ఎవరి కోసం ఈరోజు నేను ప్రెస్ మీట్ పెట్టలేదన్నారు.

balineni srinivas in to janasena party

రాజశేఖర్ రెడ్డి అభిమానిగా కృతజ్ఞతతో ప్రెస్ మీట్ పెట్టానని స్పష్టం చేశారు. వైఎస్ మరణంపై బురద జల్లడం మంచిది కాదని కోరారు. దీనికి నాతో సహా ఎవరు మాట్లాడటం మంచిది కాదు..విజయమ్మకు మొత్తం తెలుసు ఇద్దరికీ న్యాయం చేస్తారన్నారు. అధికారంలో ఉన్నప్పుడు సంపాదించుకుని పార్టీ మారాడని నన్ను అంటున్నారు..నాకు ఒక్కటే బిడ్డ.. ఒట్టేసి చెబుతున్న.. నేను ఆస్తి పోగొట్టుకున్న కానీ సంపాదించుకోలేదని తెలిపారు. నేను ఎంత ఆస్తి పోగొట్టుకున్న అనేది జగన్ మోహన్ రెడ్డికి తెలుసు అని వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version