TDP ఓటమికి చిరంజీవి, పవన్ కళ్యాణ్ కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు Tdp మాజీమంత్రి బండారు సత్యన్నారాయణ మూర్తి. పాయకరావుపేటలో రెండుసార్లు టిడిపి ఓడిపోవడానికి చిరంజీవి, పవన్ కళ్యాణ్ కారణం అన్నారు బండారు. ఒకసారి అన్నది దేబ్బేస్తే మరోసారి తమ్ముడు దెబ్బేశారని ఫైర్ అయ్యారు.
నియోజకవర్గ పరిధి లో బలమైన కాపు సామాజిక వర్గం ప్రభావం దృష్టిలో పెట్టుకుని బండారు ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలోను ఇటువంటి కామెంట్స్ చేసిన బండారు సత్యనారాయణ….ఇప్పుడు TDP ఓటమికి చిరంజీవి, పవన్ కళ్యాణ్ అన్నారు. పొత్తులు లేకపోతే టీడీపీకి నష్టమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మొదటి నుంచి జనసేనతో కలసి వెళ్లడమే కరెక్ట్ అని చెబుతున్నారు.