Vijayawada: ఈ నెల 11 నుంచి డిసెంబరు 25 వరకు భవానీ దీక్షలు

-

Vijayawada: ఈనెల 11 నుంచి డిసెంబరు 25 వరకు భవానీ దీక్షలు ప్రారంభం కానున్నాయి. విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానము, ఇంద్రకీలాద్రి నందు లోక కళ్యాణార్ధమై శ్రీ క్రోధినామ సంవత్సర భవానీ దీక్షలు ఉండనున్నాయి. ఈ నెల 11 నుండి డిసెంబరు 25 వరకు భవానీ దీక్షలు ఉంటాయి. దేవస్థాన వైదిక కమిటీ వారి సూచనల మేరకు నిర్ణయం తీసుకుంది. 11.11.2024, కార్తీక శుద్ధ దశమి/ఏకాదశి రోజున ఉ. గం.07-00లకు శ్రీ భవానీ మండల దీక్షాధారణలు ప్రారంభం అవుతాయి. 15.11.2024: కార్తీక పూర్ణిమ రోజున శ్రీ భవానీ మండల దీక్షాధారణలు సమాప్తి ఉంటుంది.


01.12.2024, : శ్రీ భవానీ అర్ధ మండల దీక్షాధారణలు ప్రారంభమకాన్నాయి. 05.12.2024, : శ్రీ భవానీ అర్ధ మండల దీక్షాధారణలు సమాప్తి ఉంటుంది. 14.12.2024 – మార్గశిర పూర్ణిమ (రాత్రి గల) రోజున “కలశ జ్యోతి” ఉత్సవము శ్రీ శృంగేరి శారదా పీఠం పరిపాలిత శ్రీ శివరామకృష్ణ క్షేత్రం (రామకోటి), సత్యనారాయణపురం, విజయవాడ నుండి సా. గం.06-30 ని.లకు బయలుదేరి నగరోత్సవముగా శ్రీ అమ్మవారి దేవస్థానమునకు చేరును. డిసెంబరు 21 నుంచీ 25 వరకు దీక్ష విరమణలు చేస్తారు. డిసెంబరు 25న మహా పూర్ణాహుతి తో భవానీ దీక్షలు సమాప్తం ఉంటుంది. డిసెంబరు 21 నుంచీ 25 వరకూ ఆర్జిత సేవలు ఏకాంతంగా జరుగును.

Read more RELATED
Recommended to you

Exit mobile version