ఏలూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ చోటు చేసుకుంది. ఏలూరు జిల్లాలో మనిషికి కూడా బర్డ్ ఫ్లూ సోకడం జరిగింది. ఉంగుటూరు మండలంలో ఒక వ్వక్తి కి బర్డ్ ఫ్లూ నిర్దారణ అయింది. ఇక బర్డ్ ఫ్లూ కేసు నమోదు కావడంతో అప్రమత్తమయింది ఏలూరు జిల్లా వైద్య శాఖ. కోళ్లఫారం సమీపంలోని ఒక వ్యక్తికి బర్డ్ ఫ్లూ లక్షణాలు ఉండటంతో సాంపిల్స్ సేకరించారు అధికారులు.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2025/02/Bird-flu-has-also-infected-a-man-in-Eluru-district.webp)
బర్డ్ ఫ్లూగా నిర్ధారణ రావడంతో మేడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ఆ ప్రాంతాని అప్రమత్తం చేశారు అధికారులు. బర్డ్ ఫ్లూ తొలికేసు నమోదు అయిందని తెలిపారు జిల్లా వైద్యశాఖధికారిణి. ఇక దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
అటు చికెన్ ధరలు అమాంతం పడిపోయాయి. ఏపీలో ఉన్న కోళ్లకు మాయ రోగం రావడంతో… చికెన్ తినేవారే కరువయ్యారు. కోస్తా ఆంధ్ర ముఖ్యంగా తూర్పుగోదావరి అలాగే పశ్చిమగోదావరి… జిల్లాలలో బర్డ్ ఫ్లూ… విజృంభిస్తోంది. దీంతో కోళ్లు… రోజుకు వేలల్లో మరణిస్తున్నాయి. అటు చికెన్ తినకూడదని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. దీంతో చికెన్ తినేందుకు.. జనాలు భయపడిపోతున్నారు. అయితే ఉన్న కోళ్లను అమ్ముకునేందుకు.. రేటు తగ్గించి వ్యాపారులు అమ్మేస్తున్నారు.