చంద్రబాబు అరెస్టుపై బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి ట్వీట్..

-

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టుపై బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి ట్వీట్ చేశారు. సరైన నోటీసు ఇవ్వకుండా ఎఫ్ఐఆరులో పేరు పెట్టకుండా చంద్రబాబును అరెస్ట్ చేశారని… ఎక్సప్లనేషన్ తీసుకోలేదు.. ప్రొసీజర్ ఫాలో కాకుండా జరిగిన చంద్రబాబు అరెస్టును ఖండిస్తున్నామని ఫైర్‌ అయ్యారు బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి.

BJP AP chief Purandeshwari’s tweet on Chandrababu’s arrest

ఈ తరహాలో అరెస్ట్ చేయడం సమర్ధనీయం కాదని… బీజేపీ దీన్ని ఖండిస్తుందన్నారు బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి. చంద్రబాబు కు ఈ విషయంలో అండగా ఉంటామన్నారు. కాగా ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం మరియు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును నంద్యాలలో ఉండగా ఈ రోజు ఉదయం సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును నిందితుడిగా పేర్కొంటూ అరెస్ట్ చేసినట్లు సిఐడి పోలీసులు వివరణ ఇచ్చారు. చంద్రబాబు పై పలు సెక్షన్ ల కింద కేసులు నమోదు చేసినట్లు నోటీసులో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version