‘జమిలి’ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందాం.. బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం

-

ప్రస్తుతం దేశమంతా జమిలి ఎన్నికల గురించే చర్చంతా. అయితే ఈ ఎన్నికలను కొంతమంది వ్యతిరేకిస్తుంటే.. మరికొంత మంది మద్దతు ఇస్తున్నారు. అయితే తాజాగా జమిలి ఎన్నికలపై బీఆర్ఎస్ స్పందించింది. జమిలి ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. అందుకు సిద్ధంగా ఉండాలని బీఆర్ఎస్ భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు యథావిధిగా నిర్వహించినా.. ఒకవేళ పార్లమెంటుతో కలిపి చేపట్టినా దీటుగా ఎదుర్కొందామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పార్టీ నాయకులకు నిర్దేశించినట్లు తెలిసింది.

జమిలి ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తే.. అందుకు సిద్ధపడాల్సిందేనని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేసినట్లు తెలిసింది. ఒకవేళ అసెంబ్లీ ఎన్నికలు ఆలస్యమైనా కూడా పార్టీకి మేలే జరుగుతుందని, అసెంబ్లీ కాలపరిమితిని మరో రెణ్నెల్లు పొడిగిస్తే.. ఆ మేరకు మరిన్ని అభివృద్ధి పనులు చేసి, ప్రజలకు చేరువవడానికి అవకాశాలు పెరుగుతాయనే అభిప్రాయం వ్యక్తమైనట్లు సమాచారం. జమిలి ఎన్నికలు జరిగినా కూడా.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభావం తెలంగాణలో ఏమీ ఉండదని, కచ్చితంగా బీఆర్ఎస్ పార్టీనే అత్యధిక అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలను గెలుచుకుంటుందని సీఎం ధీమా వ్యక్తం చేసినట్లు తెలిసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version