వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన అనుమానితుడి గా ఉన్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి త్వరలోనే బిజెపి పార్టీలో చేరుతున్నారని గత రెండు రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ వార్త వైరల్ గా మారింది. అయితే దీనిపై తాజాగా భారతీయ జనతా పార్టీ క్లారిటీ ఇచ్చింది.
వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డిని నిందితుడిగా చేర్చితే ఆయన బీజేపీలో చేరుతారని దిగజారి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరీ. నేరస్తులకు బీజేపీలో స్థానం లేదని.. బీజేపీలో అవినాష్ రెడ్డి చేరతారనే ఆలోచనతో ఉంటే దాన్ని బీజేపీ ఖండిస్తుందని స్పష్టం చేశఔ కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరీ.
ఏపీ రాజధాని అంశం పై హైకోర్టు ఇచ్చిన తీర్పును బిజెపి స్వాగతిస్తుందని… అమరావతి రాజధానికి బీజేపీ కట్టుబడి ఉందని తెలిపారు. అమరావతే రాజధానిగా వేల కోట్ల రూపాయలను కేంద్రం నిధులు కేటాయించిందన్నారు. తీర్పు ప్రకారం రైతులకు భూములను అభివృద్ధి చేసి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రాజధాని భూములను తాకట్టు పెట్టుకుంటుంది.. కోర్టు దానికి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామన్నారు.