వైసీపీలో ముసలం..రాజోలు కీలక నేత రాజీనామా !

-

కోనసీమ : రాజోలు వైసిపి నేత, రూరల్ వాటర్ సప్లై సలహాదారు బొంతు రాజేశ్వరరావు హాట్ కామెంట్స్ చేశారు. ఈ నెల 29న జనసేన నాయకులు పెట్టే వైసీపీ ప్లీనరీకి వైసీపీ నేతలు ఎవరు వెళ్ళొద్దని కోరారు. 12 ఏళ్లు కష్ట పడిన వారికి గుర్తింపు లేదు, వాళ్లే‌ బాగుపడ్డారు…మనం దోపిడీకి గురి అవుతున్నామని పేర్కొన్నారు.

ఈ నెల 17న నా పదవికి రాజీనామా చేశానని… ఇండిపెండెంట్ గా వెళ్లడమా వేరొక చోటకు వెళ్లడమా అనేది మీరే మాట్లాడుకుని నిర్ణయించండని తమ కార్యకర్తలను అడిగారు బొంతు రాజేశ్వరరావు. కార్యకర్తలు ఏ బాటలో నడవమంటే ఆ బాటలో నడుస్తాను, నేను నిబద్ధత కలిగిన వ్యక్తిని.. మీ వెంటే ఉంటాను మీరు చెప్పింది చేస్తానని స్పష్టం చేశారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయమన్నా నేను రెడీగా ఉన్నానని కార్యకర్తలకు వివరించారు. కాగా.. 2014, 2019 లలో వైసీపీ తరఫున రాజోలు నుంచి పోటీ చేసి బొంతు రాజేశ్వరరావు ఓడిపోయిన సంగతి తెలిసిందే.

 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version