ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలపై ఆ రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు ముందస్తు ఎన్నికల ప్రస్తావని ఉండదని… ఏపీలో సాధారణ ఎన్నికల్లో జరుగుతాయని ఆయన వివరించారు. చివరి వరకు అధికారంలో ఉంటామని గెలిస్తే మరో 5 ఏళ్ళు కొనసాగుతామని స్పష్టం చేశారు బొత్స సత్యనారాయణ. టిడిపి మరియు జనసేన కలుస్తాయని మొదటి నుంచి తాము చెబుతూ వచ్చామని ఇప్పుడు అదే జరిగిందని చురకలు అంటించారు. వైసీపీ కాపు నేతల సమావేశంలో పవన్ కళ్యాణ్ ను విమర్శించలేదని స్పష్టం చేశారు.
షాపులకు ఏం చేశామనేది చెప్పేందుకు రాజమండ్రిలో సమావేశం అయ్యామని బొత్స సత్యనారాయణ వెల్లడించారు. జనసేన పార్టీ జనం వానిని ప్రభుత్వం ఆపలేదు ఆయనకు కావాలంటే ఒడిశాలో కూడా పెట్టుకోవచ్చని ఎద్దేవా చేశారు. సెలబ్రిటీ కాబట్టి ముందస్తు సమాచారం ఇవ్వాలని అడిగామన్నారు. ఇష్టమున్న లేకపోయినా చెబుతున్నా… బయటికి వెళ్ళినప్పుడు నన్ను ఇద్దరు చూస్తే, పవన్ కళ్యాణ్ ను రెండు వందల మందో 200 మందో చూస్తారని తెలిపారు బొత్స సత్యనారాయణ. రాష్ట్ర ప్రజలు ఏ సెలబ్రిటీ నైనా అలాగే చూస్తారని వ్యాఖ్యానించారు.