BREAKING : TTD నుంచి రమణ దీక్షితులు తొలగింపు !

-

BREAKING : TTD రమణ దీక్షితులుకు బిగ్‌ షాక్‌ తగిలింది. TTD నుంచి రమణ దీక్షితులును తొలగించారు. తిరుమల శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు వ్యవహారంపై సీరియస్ గా స్పందించింది TTD పాలకమండలి. TTD, అహోబిల మఠం, జియ్యంగార్లు,అర్చకులపై రమణ దీక్షితులు అనుచిత వాఖ్యలు చేసారని…..క్రమశిక్షణా రాహిత్యంతో వ్యవహరించిన రమణ దీక్షితులును టీటీడీ నుంచి తొలగిస్తున్నామని ప్రకటించారు చైర్మన్ కరుణాకర్ రెడ్డి.

Removal of Ramana Dixitulu from TTD

గాలిగోపురం, ఆంజనేయ స్వామి విగ్రహం, మోకాల మిట్ట ప్రాంతాల్లో ఇక పై నిత్య సంగీతార్చన నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. తాళ్లపాకల్లో అన్నమయ్య కళామందిరం నిర్మాణంతో పాటు నిత్య సంగీతార్చన నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని…తిరుమల శ్రీవారి ఆలయంలోని జయ విజయల వద్ద వున్న తలుపులకు 1.69 కోట్లతో బంగారు తాపడం చేయిస్తామన్నారు. 4 కోట్లతో 4,5,10 గ్రాముల తాళి బోట్టులు తయ్యారి..నాలుగు కంపెనీలకు టెండర్ కేటాయింపులు చేస్తున్నట్లు వివరించారు. ధార్మిక సదస్సులో తీసుకున్న అన్ని నిర్ణయాలకు ఆమోదం తెలిపినట్లు చెప్పుకొచ్చారు టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి.ఇక పై ప్రతి ఏటా టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతి అవిర్భావ దినోత్సవం ఫిబ్రవరి 24వ తేదీన నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటన చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version