తుంగభద్ర డ్యామ్ లో సమస్య…తెగిపోయిన 19వ గేటు !

-

కర్ణాటక హోస్పేట్ లోని తుంగభద్ర డ్యామ్ లో సమస్య చోటు చేసుకుంది. తుంగభద్ర డ్యామ్ కు చెందిన 19వ గేటు కనిపించకుండా పోయింది. 19వ గెట్ చైన్ లింక్ తెగిపోయినట్లు గుర్తించారు అధికారులు. ఈ సంఘటన రాత్రి 11 గం.లకు జరిగినట్లు అధికారులు చెబుతున్నారు.

Broken Tungabhadra Dam 19th gate chain link

చీకటి కావడంతో గేటు కొట్టుకుపోయిందా లేక అక్కడే పడిపోయిందా తెలుసుకోలేకపోయారు అధికారులు. చైన్ లింక్ తెగిపోవడం, గేటు కనిపించకపోవడాన్ని ధృవీకరించారు అధికారులు. ఇక తుంగభద్ర డ్యామ్ నుంచి ప్రస్తుత ఔట్ ఫ్లో 75 వేల క్యూసెక్కులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం తుంగభద్ర డ్యామ్ నుంచి 75 వేల క్యూసెక్కుల నీటిని ఐదు గంటల నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ఇక ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version