భర్త అనుమానిస్తున్నాడని కన్న బిడ్డను చంపేసింది ఓ కసాయి తల్లి. ఈ సంఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖపట్నం పరిధి పెదగదిలి కొండవాలు ప్రాంతానికి చెందిన గొర్రె వెంకటరమణ, శిరీషలకు 2013లో పెళ్లైంది. ఐదు నెలల కిందట వీరికి ఒక పాప పుట్టింది. వెంకటరమణ కొంతకాలంగా భార్యపై అనుమానం పెంచుకొని నిత్యం మాటలతో వేధిస్తుండేవాడు. పాప పుట్టిన తర్వాత వేధింపులు మరింత ఎక్కువయ్యాయని అంటున్నారు.
ఇంట్లో సీసీ కెమెరా పెట్టి మరి భార్యను గమనించేవాడు.. తీవ్ర మనస్తాపానికి గురైన భార్య శిరీష ఈనెల 13న పడుకొని ఉన్న తన పాపను దిండుతో నొక్కి ఊపిరి ఆడకుండా చేసి చంపేసింది. ఎవరికీ అనుమానం రాకుండా ఉండడానికి తెన్నేటిపార్కు తీరానికి పాప మృతదేహాన్ని తీసుకెళ్లి సముద్రంలోకి దిగింది. ఇక ఆరిలోవ పోలీసులు శిరీషను అదపులోకి తీసుకుని విచారించగా, భర్త అనుమానిస్తుండడంతో కోపానికి గురై పాపను చంపినట్లు ఒప్పుకుంది.