పీఎం స్వనిధి స్కీం కి అప్లై చేయాలా? అర్హత వివరాలు, దరఖాస్తు విధానం తెలుసుకోండి..!

-

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల ద్వారా చాలా శాతం మంది ఎన్నో ఉపయోగాలను పొందుతున్నారు. ఆర్థిక సహాయాన్ని పథకాల ద్వారా అందించడం వలన అన్నిరంగాల వారు అభివృద్ధి చెందుతున్నారు. అయితే వీధి వ్యాపారుల కోసం కూడా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అదే ప్రధానమంత్రి స్వనిధి పథకం. ఈ పథకం ద్వారా వీధి వ్యాపారులకు 10 వేల నుండి 50 వేల వరకు రుణాలను అందించడం జరుగుతుంది మరియు దీనికి సంబంధించిన వడ్డీ పై ఏడు శాతం వరకు సబ్సిడీని కూడా అందిస్తున్నారు.

అర్హత వివరాలు:

విక్రయాల ధ్రువీకరణ పత్రాలు ఉండేటువంటి వీధి వ్యాపారులు ఈ పథకానికి అర్హులు. దీనితో పాటుగా పట్టణ స్థానిక సంస్థల నుండి లెటర్ ఆఫ్ రికమండేషన్ ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వెండింగ్ సర్టిఫికెట్ లేక గుర్తింపు కార్డు లేని వ్యాపారులు తాత్కాలికంగా విక్రయ దృవీకరణ పత్రాన్ని ఐటీ ఆధారిత ప్లాట్ఫార్మ్ ల ద్వారా పొందవచ్చు మరియు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు చేసుకునే విధానం:

ప్రధానమంత్రి స్వనిధి పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ముందుగా ఆన్లైన్ లో కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి లేక కామన్ సర్వీస్ సెంటర్ కు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునే వారు అధికారిక వెబ్సైట్ కు వెళ్లి అక్కడ ఉండేటువంటి లోన్ ఆప్షన్లను ఎంపిక చేసుకోవాలి. వీధి వ్యాపారులు ఎవరైతే మొదటిసారి దరఖాస్తు చేసుకుంటున్నారో పదివేల రుణానికి సంబంధించిన ఆప్షన్ ను ఎంపిక చేసుకోవాలి మరియు రెండోసారి దరఖాస్తు చేసుకునేవారు 20,000 ఆప్షన్ ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత అప్లికేషన్ కు సంబంధించిన వివరాలను అందజేయాలి. ఆధార్ కార్డు నెంబర్, మొబైల్ నెంబర్, వెండర్ ఐడితో పాటుగా విక్రయిత గుర్తింపు కార్డు వంటి ఇతర డాక్యుమెంట్లను వెబ్సైట్ లో అప్లోడ్ చేయాలి. ఈ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత అర్హులు అయిన వారికి రుణాన్ని అందజేయడం జరుగుతుంది మరియు సరైన సమయంలో రుణాన్ని తిరిగి చెల్లించితే ఏడు శాతం వరకు వడ్డీలో సబ్సిడీను పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version