గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందాల పర్యటన

-

గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన నష్టాలని అంచనా వేయడానికి కేంద్ర బృందాలు బుధవారం,గురువారం అల్లూరిసీతారామరాజు, డా.బిఆర్అంబేద్కర్ కోనసీమ, ఏలూరు జిల్లాల్లో పర్యటించనున్నట్లు విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు.

కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆర్ధిక సలహాదారు (ఎన్డీఎంఏ) రవినేష్ కుమార్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కూడిన రెండు బృందాలు రెండు రోజులపాటు (ఆగస్టు 10-11) ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు విపత్తుల సంస్థ ఎండి డా.బిఆర్అంబేద్కర్ తెలిపారు. డాక్టర్.కె.మనోహరన్, శ్రావణ్ కుమార్ సింగ్, పి.దేవేందర్ రావు, ఎం.మురుగునాధన్, అరవింద్ కుమార్ సోని బృందంలో సభ్యులుగా ఉన్నారని తెలిపారు.

బుధవారం 10-08-2022 అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఒక బృందం, ఏలూరు జిల్లాలో ఒక బృందం పర్యటించనున్నాయి.గురువారం 11-08-2022 డా.బిఆర్అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రెండు బృందాలు పర్యటించనున్నాయి. ఆ తరువాత కేంద్రబృందం గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి శ్రీ జగన్ గారితో సమావేశం కానున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version