ఇవాళ ఏపీ బంద్. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో… ఏపీకి బంద్ కు పిలుపునిచ్చింది తెలుగు దేశం పార్టీ. చంద్రబాబుకు బెయిల్ వస్తుందా? లేక రిమాండ్ కు తరలిస్తారా అనేదానిపై ఉత్కంఠ తెర పడింది. చంద్రబాబుకు 14 రోజులు రిమాండ్‌ను విధిస్తూ ఏసీబీ కోర్టు తీర్పునిచ్చింది.
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని పోలీసులు ఏసీబీ కోర్టులో హాజరుపరిచిన విషయం తెలిసిందే. దీంతో చంద్రబాబుకు రిమాండ్ విధించారు జడ్జి. అయితే..టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా బంద్ కు పిలుపునిచ్చింది టీడీపీ పార్టీ.
ఇక ఈ బంద్‌కు మద్దతు తెలిపింది జనసేన. దీంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ బంద్ సందర్భంగా పలు విద్యా సంస్థలకు ముందుగానే సెలవులు ప్రకటించారు నిర్వాహకులు. అటు అవాంచనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తం అయ్యారు. అటు ఏపీ వ్యాప్తంగా 144 సె క్షన్ కూడా అమలు చేస్తున్నారు పోలీసులు.