చిత్తూరు జిల్లా పుంగనూరులో పారిశ్రామికవేత్త రామచంద్ర యాదవ్ ఇంటిపై దాడి జరిగింది. గత ఎన్నికలలో ఆయన జనసేన పార్టీ తరపున పోటీ చేశారు. నియోజకవర్గంలో రైతు సమస్యలపై రైతు భేరీ కార్యక్రమాన్ని తలపెట్టారు. అయితే ఈ కార్యక్రమానికి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు.
సభకు వెళ్లకుండా రామచంద్ర యాదవును అడ్డుకున్న పోలీసులు ఆయనని సాయంత్రం వదిలేశారు. ఆ తర్వాత ఆయన తన అనుచరులతో కలిసి స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్లి క్షీరాభిషేకం చేశారు. అనంతరం రామచంద్ర యాదవ్, ఆయన అనుచరులు ఎవరింటికి వారు వెళ్లిపోయారు. ఆ రాత్రి రామచంద్ర యాదవ్ ఇంటిపై దాడి జరిగింది. అయితే ఇది వైసిపి కార్యకర్తల పనే అంటూ ఆయన వర్గీయులు ఆరోపిస్తున్నారు.
ఈ ఘటనపై ట్విట్టర్ వేదికగా స్పందించారు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు. దాడికి సంబంధించిన వీడియో ని పోస్ట్ చేసిన చంద్రబాబు “ఇది నాటి రోజుల్లో బీహార్ కాదు.. నేటి రోజుల్లో పుంగనూరు! డీజీపీ గారు.. నాలుగు జతల ఖాకీ దుస్తులు మీ స్థానిక అధికారులకు పంపండి. లేకపోతే రాష్ట్రంలో మొత్తం పోలీసు శాఖను మూసేశారు అనుకుంటారు ” అని ట్విట్ చేశారు.
ఇది నాటి రోజుల్లో బీహార్ కాదు…నేటి రోజుల్లో పుంగనూరు! డీజీపీ గారూ… నాలుగు జతల ఖాకీ దుస్తులు మీ స్థానిక అధికారులకు పంపండి. లేకపోతే రాష్ట్రంలో మొత్తం పోలీసు శాఖను మూసేశారు అనుకుంటారు.@APPOLICE100
#YSRCPRowdyism #YCPGoondas pic.twitter.com/VlyeXQeCA3— N Chandrababu Naidu (@ncbn) December 5, 2022