చంద్రబాబు కరకట్ట నివాసంపై రూ. 89 లక్షల విద్యుత్ బకాయిలు ఉన్నట్లు సమాచారం అందుతోంది. సీఆర్డిఏ పరిధిలో భారీగా విద్యుత్ బకాయిలు ఉన్నట్లు తాజాగా విద్యుత్ శాఖ పేర్కొంది. టాప్ టెన్ విద్యుత్ బకాయి పడిన వాటిలో చంద్రబాబు కరకట్ట నివాసం ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఏకంగా 89 లక్షల రూపాయలు విద్యుత్ బకాయిలు ఉన్నట్లు విద్యుత్ శాఖ ద్వారా సమాచారం అందుతోంది.
విద్యుత్ బిల్లులు చెల్లించకుండా పెండింగ్ లో పెట్టాయి చంద్రబాబుకు చెందిన పలు కంపెనీలు. చంద్రబాబు నివాసంతో సహా మిగిలిన 9 కంపెనీలు 26 కోట్ల 26 లక్షల, 74 వేల రూపాయలు బకాయి ఉన్నట్లు విద్యుత్ శాఖ చెబుతోంది. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ఇటీవలే చంద్రబాబు సహా మరికొందరి ఆస్తుల ఆటాచ్ చేసింది. కరకట్టపై చంద్రబాబు గెస్ట్‌హౌస్‌ను అటాచ్ చేసింది ఏపీ ప్రభుత్వం. క్రిమినల్ లా అమెండమెంట్ 1944 చట్టం ప్రకారం అటాచ్ చేసిన అధికారులు..వీటితోపాటు మరికొందరి టీడీపీ నాయకులు ఆస్తులనూ అటాచ్ చేశారు.