మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కు లేఖ రాశారు టీడీపీ అధినేత చంద్రబాబు. నారాయణ అరెస్ట్ రాజకీయ కక్షతో జరిగిందని లేఖలో పేర్కొన్న చంద్రబాబు… హైదరాబాద్ నుంచి చిత్తూరు తరలింపులో జాప్యం వెనుక దురుద్దేశ్యం ఉందని ఫైర్ అయ్యారు.
రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ సమయం జరిగిన ఉదంతాన్ని లేఖలో ప్రస్తావించిన చంద్రబాబు… నారాయణను పోలీసు కస్టడీలో ఉంచే ప్రయత్నంపై ఆందోళన వ్యక్తం చేశారు. పేపర్ లీకేజీ కేసులో అదనపు సెక్షన్లు జోడించి అక్రమ అరెస్టపకు పాల్పడ్డారని లేఖ రాశారు చంద్రబాబు.
చిత్తూరు ఎస్పీ వైసీపీకి అనుకూలంగా వ్యవహరించే అధికారి అని లేఖలో పేర్కొన్న టీడీపీ అధినేత. ఘటన పై జోక్యం చేసుకుని న్యాయం చేయాలన్నారు. కేంద్ర హోం మంత్రితో పాటు రాష్ట్ర గవర్నరుకు కూడా లేఖ రాశారు చంద్రబాబు. కాగా.. తాజాగా మాజీ మంత్రి నారాయణ కు బెయిల్ మంజూరు అయింది. దీంతో ఆయన ఇవాళ విడుదల కానున్నారు.