కొవ్వూరు కో-అపరేటివ్ బ్యాంక్ ఎన్నికల విషయంలో హైకోర్ట్ తీర్పును స్వాగతిస్తున్నా – చంద్రబాబు

-

తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల వ్యవహారం గురించి తెలిసిందే. టిడిపి ఏకగ్రీవం చేసుకోవడంతో వైసిపి నేతలు ఎన్నికలు రద్దు చేశారని టిడిపి నేతలు ఆరోపించారు. ఈ వ్యవహారం హైకోర్టు వరకు వెళ్ళింది. నేడు దీనిపై హైకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో టిడిపి నేత చంద్రబాబు నాయుడు స్పందించారు. ” కొవ్వూరు కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల విషయంలో హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నా.

ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన కొవ్వూరు అర్బన్ బ్యాంకు ఎన్నికలను రద్దుచేసి ఎన్నికల వ్యవస్థను అపహాస్యం చేసిన జగన్ రెడ్డికి…హైకోర్టు ఇచ్చిన తీర్పు చెంపపెట్టులాంటిది. బ్యాంక్ పాలక వర్గం స్థానంలో ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ చట్ట విరుద్ధమని హైకోర్ట్ తీర్పు ద్వారా స్పష్టం చేసింది. వ్యక్తులు తప్పు చేస్తే సరిదిద్దాల్సిన అధికార వ్యవస్థలను సైతం జగన్ భ్రష్టుపట్టించారు. న్యాయబద్ధంగా జరిగిన ఏ ఎన్నికల ఫలితాన్ని అంగీకరించేందుకు సిఎం సిద్ధంగా లేరని మళ్లీ రుజువైంది. అయితే తన పంతమే ఫైనల్ కాదని…న్యాయ వ్యవస్థ ఉందని జగన్ రెడ్డి గుర్తించాలి. ఇప్పటికైనా చట్టాలకు, నిబంధనలకు లోబడి పనిచేయడం నేర్చుకోవాలి”. అని ట్వీట్ చేశారు చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Exit mobile version