సౌత్ సినీ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న సమంత నేడు పాన్ ఇండియా హీరోయిన్ గా చలామణి అవుతోంది. ఇకపోతే తాను ప్రేమించిన నాగచైతన్యను వివాహం చేసుకొని ఆ తరువాత విడాకులు తీసుకుంది. ఇక విడాకుల తర్వాత కూడా ఏమాత్రం తగ్గకుండా పడి లేచిన కెరటంలా వరుస అవకాశాలు అందుకుంటూ తన సినీ కెరియర్లో దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా సమంత వివాహానికి ముందు ఏ రేంజ్ లో అయితే సినిమాలలో జోరు కొనసాగించిందో విడాకుల తర్వాత రెట్టించిన వేగంతో సినిమాలలో దూసుకుపోతూ ఉండడం గమనార్హం. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూనే బోల్డ్ పాత్రలలో కూడా నటించడానికి వెనుకాడడం లేదు ఈ ముద్దుగుమ్మ.
సోషల్ మీడియాకి దూరంగా ఉన్న సమంత.. అందుకేనా..?
-