నారా భువనేశ్వరికి చంద్రబాబు స్పెషల్‌ ట్రీట్‌

-

నారా భువనేశ్వరికి చంద్రబాబు స్పెషల్‌ ట్రీట్‌ ఇచ్చారు. ఇవాళ నారా భువనేశ్వరి జన్మదినం. ఈ తరుణంలోనే… నారా భువనేశ్వరికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఏపీ సీఎం చంద్రబాబు. భువనేశ్వరి నాకు ఎల్లప్పుడూ నహకరిస్తూ దృఢంగా ఉంటూ, చీకటి రోజుల్లో కూడా నవ్వుతూ నన్ను అనుసరించారు చంద్రబాబు.

Chandrababu wishes Nara Bhuvaneswari on her birthday

ప్రజలకు సేవ చేయాలనే నా తపనలో 100శాతం అండగా నిలుస్తున్నందుకు నా సర్వసం అయిన భువనేశ్వరికి అభినందనలు అంటూ ఎమోషనల్‌ అయ్యారు చంద్రబాబు. ఇది ఇలా ఉండగా, రాజధాని ప్రాంత పర్యటనకు తన నివాసం నుంచి బయలుదేరారు సీఎం చంద్రబాబు. తన నివాసం పక్కనున్న ప్రజా వేదిక శిధిలాలు పరిశీలన చేశారు.

డెబ్రిస్ ఇక్కడే ఉంచడం ద్వారా నాటి విధ్వంసం ఏ స్థాయిలో జరిగిందో జనానికి నిత్యం గుర్తు చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచనలు చేశారు. ఆ తర్వాత నేరుగా ఉద్దండ రాయుని భూమి పూజ ప్రాంతాన్ని సందర్శించనున్నారు సీఎం చంద్రబాబు. చంద్రబాబు వెంట మంత్రి నారాయణ, ఎమ్మెల్యేలు ధూళిపాళ, కొలికపూడి, సీఆర్డీఏ కమిషనర్ కాటంనేని ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version