విజయవాడ, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు భూసేకరణ !

-

ఏపీ ప్రజలకు అదిరిపోయే శుభవార్త. విజయవాడ, విశాఖ మెట్రోరైల్ ప్రాజెక్టులపై కసరత్తు మొదలు పెట్టారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇందులో భాగంగానే… విజయవాడ, విశాఖ మెట్రోరైల్ ప్రాజెక్టుల కోసం భూసేకరణకు సిద్ధమైంది ఏపీ ప్రభుత్వం. మొత్తం 199 ఎకరాల భూ సేకరణకు కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు.

CM Chandrababu Naidu has started work on the Vijayawada and Visakha metro rail projects

విజయవాడలో 101 ఎకరాలు, విశాఖలో 98 ఎకరాల భూసేకరణ చేయనుంది చంద్రబాబు నాయుడు సర్కార్‌. తొలిదశ పనులకు రూ.11,009 కోట్లు అవసరమని అంచనా వేస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు.. ఇందులో భాగంగానే… డీపీఆర్‌లను కేంద్రానికి పంపింది ఏపీ ప్రభుత్వం. వందశాతం నిధులు కోరుతూ కేంద్రానికి చంద్రబాబు లేఖ రాశారు. మరి దీనిపై కేంద్రం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version