మార్చి 31వ తేదీలోపు రైతులందరి ఖాతాలలో డబ్బులు జమ – తుమ్మల

-

తెలంగాణ రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పారు తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రైతుబంధు నిధులు ఎప్పుడు పడతాయని రైతులు ఎదురుచూస్తున్న నేపథ్యంలో… తాజాగా కీలక ప్రకటన చేశారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రైతు బంధు నిధులను మార్చి 31వ తేదీలోపు రైతులందరి ఖాతాలలో జమ చేస్తామని తాజాగా ప్రకటించారు.

rythu

మొన్న జనవరి 26వ తేదీ నుంచి సంక్షేమ పథకాలన్నీ అమలు చేసి రైతుబంధు వేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. కానీ ఇప్పుడు మార్చి 31వ తేదీ లోపు రైతుబంధు నిధులు జమ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేయడం జరిగింది. ఒక సంవత్సరంలోనే రైతుల సంక్షేమం కోసం 54 వేల కోట్లు ఖర్చు చేశామని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో 72,000 కోట్ల నిధులను వ్యవసాయం కోసం అలాగే వ్యవసాయ అనుబంధ రంగాలకి కేటాయించినట్లు వివరించారు తుమ్మల నాగేశ్వరరావు. రైతులకు ఉచిత కరెంటు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఇబ్బందులు లేకుండా ఇస్తున్నామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version