రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

-

ఏపీలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రాభివృద్ధిపై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసే దిశగా చంద్రబాబు సర్కార్ అడుగులు వేస్తోంది. అయితే రాష్ట్రంలో ఆర్ధిక ఇబ్బందులు ఉన్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆర్థిక కష్టాలున్నా ఇచ్చిన మాట ప్రకారం ఉచిత ఇసుక ఇస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. దీనివల్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని..వైసీపీలోని కొందరికి కడుపు నొప్పి వచ్చిందని సీఎం చంద్రబాబు ఎద్దేవా చేశారు.

ఈ క్రమంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘వాస్తవంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదు అని చెప్పారు. ఖజానాలో డబ్బుల్లేవు. నిధుల కోసం ఇప్పటికే ఢిల్లీ వెళ్లి అందరినీ రిక్వెస్ట్ చేశానని తెలిపారు’. ఒకపక్క రాష్ట్రంలో రోజువారీ అప్పులున్నాయి. అప్పులు ఇచ్చినవాళ్లు రోజూ తిరుగుతున్నారు అని పేర్కొన్నారు. ఈరోజు విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేశామని తెలియజేశారు. గత ప్రభుత్వం అప్పులు చేయడం వల్ల ప్రజలు కష్టాలు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ప్రజలు నిరాశ పడవద్దు అని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను త్వరలో పూర్తిగా అమలు చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version