బాపట్ల జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు.. ఏపీలో పెన్షన్ల పంపిణీ చేయనున్నారు. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి పెన్షన్ల పంపిణీ ప్రారంభం అయింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 60 లక్షల మందికి పైగా పెన్షన్ల పంపిణీ చేయనున్నారు. ఇవాళ ఉదయం 10.40 గంటలకు బాపట్ల జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ఉంటుంది.

ఈ సందర్బంగా పెద్దగంజాం, కొత్త గొల్లపాలెంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. అటు ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్. నేటి నుంచి రెండో ఫ్రీ సిలిండర్ ఇవ్వనున్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ‘దీపం–2’ పథకం కింద రెండో ఫ్రీ సిలిండర్ ఇచ్చేందుకు సిద్ధమైంది.