ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గుడివాడలో పర్యటించనున్నారు. ఈ నెల 19న గుడివాడ, 22న మచిలీపట్నంలో సీఎం జగన్ పర్యటన ఉండనున్నట్లు ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని ప్రకటన చేశారు. వాతావరణం అనుకూలిస్తే సీఎం పర్యటన అవంతరాలు లేకుండా నిర్వహిస్తామన్నారు.
టీడీపీ హయంలో నామమాత్రంగా 12వందల ఫ్లాట్ల నిర్మాణం చేశారు. వైసీపీ పాలనలో 9వేల ఫ్లాట్ల నిర్మాణం పూర్తి అయ్యింది. 9వందల కోట్లతో పూర్తిస్థాయి మౌలిక వసతులతో టిడ్కో లేఅవుట్ అభివృద్ధి చేసినట్లు వివరించారు. లబ్ధిదారుల తరఫున సీఎం జగన్ కి కృతజ్ఞతలు చెప్పారు కొడాలి నాని.
ఈ అటు ఈ పర్యటనపై ఏపీ మంత్రి రోజా మాట్లాడారు. కృష్ణాజిల్లా చరిత్రలో నిలిచి పోయే 2 పనుల కోసం జగన్ ఈ నెలలో జిల్లాకు వస్తున్నారు. ఈనెల 19న గుడివాడలో 8,912 టిడ్కో ఇళ్లు పంపిణీ. ఈనెల 22న మచిలీపట్నం పోర్టు శంకుస్థాపన జగన్ చేస్తారన్నారు రోజా. చంద్రబాబు ఎన్నికల ముందు హడావిడిగా భూమి పూజ చేశాడు. శంకుస్థాపనలు తప్ప వాటిని పూర్తి చేసి ప్రజలకు అందించాలన్న ఆలోచన చంద్రబాబుకు లేదు. జగన్ శంకుస్థాపన చేస్తే పనులు పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వస్తాయన్నారు మంత్రి రోజా.