చంద్రబాబు – పవన్ ను నమ్మడం అంటే కాటేసే పాముని నమ్మడం – తినేసే పులిని ఇంటికి తెచ్చుకోవడం లాంటిదే అంటూ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందే చంద్రబాబుకు బీసీలు గుర్తుకు వస్తారు….బీసీల అభివృద్ధికి చంద్రబాబు చేసింది శూన్యం అంటూ నిప్పులు చెరిగారు. వరుసగా నాలుగేళ్లలో అక్కచెల్లెమ్మలకు వైయస్ఆర్ చేయూత ద్వారా ఒక్కొక్కరికి మొత్తం రూ. 75,000 ఆర్థిక సాయం అందించారు సీఎం జగన్.
ఈ సందర్భంగా 2014 ఎన్నికల లో జనసేన- టీడీపీ మ్యానిఫెస్టోలో అంశాలను ప్రస్తావించి వైఫల్యాలను ఎత్తి చూపించారు జగన్. పొదుపు సంఘాల రుణాలను రద్దు చేస్తామని ప్రకటించారని….బాబు వస్తున్నాడు…రుణ విముక్తి చేస్తాడని ప్రకటనలు ఇచ్చి మరీ మోసం చేశారని చురకలు అంటించారు. ఉమెన్ ప్రొటెక్ష న్ ఫోర్స్ సహా అన్ని వాగ్దానాలను బాబు, దత్తపుత్రుడు అమలు చేశారా….? అని అడుగుతున్నాను అంటూ ఫైర్ అయ్యారు జగన్. చంద్రబాబు పేరు చెబితే మోసాలు దాగాలు గుర్తుకు వస్తాయి…దత్త పుత్రుడు పేరు చెబితే అమ్మాయిల మోసం చేసే విషయాలు గుర్తుకు వస్తాయని సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్.