సీఎం జగన్ బీసీల పక్షపాతి – వై.వి సుబ్బారెడ్డి

-

సీఎం జగన్ బీసీల పక్షపాతి అని అన్నారు వై.వి సుబ్బారెడ్డి. ఆదివారం బీసీ గర్జన సభలో ఆయన మాట్లాడుతూ.. పదవులు, ప్రాతినిధ్యం ఇవ్వడంలో జగన్ చూపించే చొరవే అందుకు నిదర్శనమన్నారు. బీసీల గొంతు చట్ట సభల్లో వినిపించేందుకు ఆర్.కృష్ణయ్య ను రాజ్యసభకు పంపించారని తెలిపారు. పార్టీ ఆవిర్భావం మొదట్లోనే ఆర్.కృష్ణయ్యకు రాజకీయ అవకాశం కల్పించాలని జగన్ భావించారని తెలిపారు వైవి సుబ్బారెడ్డి.

ఏపీలో బీసీలకు దక్కుతున్న ప్రాధాన్యతను ఇతర రాష్ట్రాలు గమనిస్తున్నాయన్నారు. బీసీ ముఖ్యమంత్రుల పాలిట రాష్ట్రాలలో దక్కని అవకాశాలను జగన్మోహన్ రెడ్డి కల్పిస్తున్నారని అన్నారు. బీసీలు వెనుకబడిన వాళ్ళు కాదు.. వెన్నెముక అన్న మాటకు కట్టుబడి సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్న ఘనత ఏపీ ప్రభుత్వానిదేనని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version