ఏప్రిల్ 3న ఎమ్మెల్యేలతో సీఎం జగన్ భేటీ

-

వై నాట్ 175 నినాదంతో ముందుకు వెళుతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలను గడప గడపకు ప్రభుత్వం పేరుతో ప్రజల వద్దకు పంపిన సీఎం.. ఈ కార్యక్రమం పై ఏప్రిల్ 3వ తేదీన ఎమ్మెల్యేలతో సమీక్ష నిర్వహిస్తారని సమాచారం. ఏప్రిల్ 3వ తేదీన ఎమ్మెల్యేలతో భేటీకానున్నారు ముఖ్యమంత్రి. వైసీపీ ఎమ్మెల్యేలు, నాయకులతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో 2024 ఎన్నికలకు సంబంధించి కేడర్ కు దిశ నిర్దేశం చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇప్పటికే ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం జగన్ క్షేత్రస్థాయి సర్వే నివేదికలు తెప్పించుకున్నారు. కొంతమంది ఎమ్మెల్యేల పనితీరుపై ఆయన ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ఎమ్మెల్యేల పనితీరుపైన ఫైనల్ వార్నింగ్ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. ఏప్రిల్ 3వ తేదీన తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సాయంత్రం మూడు గంటలకు సమావేశం జరగనుంది. ఎన్నికల ఏడాది కావటం తో ఈసారి ముఖ్యమంత్రి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వెనుకబడిన వారికి సీరియస్ గా హెచ్చరించే అవకాశం ఉందని సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version