చంద్రబాబుకు ఓటేస్తే…గోవిందా, గోవిందా – సీఎం జగన్‌

-

చంద్రబాబుకు ఓటేస్తే…గోవిందా, గోవిందా అంటూ సెటైర్లు పేల్చారు సీఎం జగన్‌. అనకాపల్లి జిల్లా…చోడవరం చేరుకున్న సీఎం జగన్‌.. ఈ సందర్భంగా కొత్తూరు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ… వచ్చే ఎన్నికల్లో మీరు వేసే ఓటు ఇంటింటి అభివృద్ధిని, పేదల తలరాతలను నిర్ణయించేవి అన్నారు. జగన్ కు ఓటేస్తే పథకాలు అన్నీ కొనసాగింపు….చంద్రబాబుకు ఓటేస్తే పథకాలు అన్నీ ముగింపు అని పేర్కొన్నారు.

CM Jagan will participate in election campaign meetings in three constituencies today

ఇది చంద్రబాబు గత పాలన చెప్పిన సత్యమన్నారు. బిందెడు పన్నీరు తీసుకెళ్లి బూడిదలో పోస్తే ఏమౌతుంది….గోవిందా…..గోవిందా…..!!. చంద్ర బాబును నమ్మితే గోవిందా….గోవిందా అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్‌. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు దొరికిపోవడంతో ఉమ్మడి రాజధాని హైదరాబాద్ గోవిందా…గోవిందా……ఢిల్లీలో రాజేపడ్డంతో ప్రత్యేక హోదా, విభజన హామీలు గోవిందా అన్నారు. అన్ని హంగులు ఉన్న వైజాగ్ వదిలేసిన చంద్రబాబు….గ్రాఫిక్స్ రాజధాని చూపించాడు…..అది కూడా గోవిందా అంటూ సెటైర్లు పేల్చారు సీఎం జగన్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version