సీఎం వైఎస్ జగన్..మచిలీపట్నం టూర్ ఫిక్స్ అయింది. ఇవాళ సీఎం వైఎస్ జగన్ కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా బందరు పోర్టు నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఈ మేరకు ఇవాళ ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.
బందరు మండల పరిధిలోని తపసిపూడి గ్రామం చేరుకోనున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్… పోర్టు నిర్మాణ ప్రదేశంలో భూమి పూజ, అనంతరం పైలాన్‌ను ఆవిష్కరించనున్నారు. ఆ తర్వాత పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకోనున్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఉదయం పదిన్నరకు జిల్లా పరిషత్ సెంటర్‌లోని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభా ప్రాంగణానికి రానున్నారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు ముఖ్యమంత్రి జగన్.