సీఎం జగన్ నిర్ణయాలతో రైతులకు మేలు జరుగుతుంది అని ఏపీ వ్యవసాయ శాఖామంత్రి కాకాణీ గోవర్ధన రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వర్క్ షాప్ లో వ్యవసాయ విధానాలపై చర్చిస్తారు. ఎక్కువమంది FPO లను తయారు చేసి రైతులకు మేలు చేయడం పై మాట్లాడతారు అని తెలిపారు.
ఇండ్ గ్యాప్ సర్టిఫికేట్ కోసం క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో ఒక ఎంఓయూ చేసుకున్నాం అని వెల్లడించాారు. సీఎం జగన్ నిర్ణయాలతో రైతులకు మేలు జరుగుతుంది అని తెలిపారు మంత్రి కాకాణీ. పండించిన ధాన్యం నిలువ ఉంచేందుకు గోదాములు నిర్మించామని తెలిపారు. తడిసిన ధాన్యానికి సంబంధించి పౌరసరఫరాల శాఖ చర్యలు తీసుకుంటోంది. అక్కడక్కడ ఏమైనా చిన్న చిన్న సమస్యలు కనిపిస్తే భూతద్దంలో చూపద్దు. సీజన్ ముగిసే లోగా ఇన్ పుట్ సబ్సిడీ వేస్తాం… చంద్రబాబు లాగా కాదు…వర్షం కురుస్తుండగానే నారుమళ్ళు దెబ్బతింటే సహాయం చేసామని వెల్లడించారు.