సీఎం జగన్ విదేశీ పర్యటనలో హల్చల్..లోకేష్ అరెస్ట్ !

-

సీఎం జగన్ విదేశీ పర్యటన నేపథ్యంలో…ఓ అనుమానాస్పద వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. సీఎం జగన్ లండన్ వెళ్ళే సమయంలో ఎయిర్ పోర్ట్ లో అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అదుపులోకి తీసుకున్న వ్యక్తి అమెరికా వాషింగ్ టన్ కు చెందిన డాక్టర్ తుళ్ళూరు లోకేష్ గా గుర్తించారు. లోకేష్ కి అమెరికన్ సిటీజన్ షిప్ ఉన్నట్టు గుర్తించారు పోలీసులు.

 

Chief Minister YS Jagan visited London

సీఎం జగన్ ఫారెన్ టూర్ పై కొన్ని మెసేజ్ లు ముందుగానే లోకేష్ పెట్టినట్టు గుర్తించారు పోలీసులు. సీఎం వెళ్ళే సమయంలో ఎయిర్ పోర్ట్ లో లోకేష్ కనపడటంతో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే… ఆ పోలీసులు గట్టిగా ప్రశ్నించడంతో గుండె పోటు వచ్చిందన్న లోకేష్ ను ఆసుపత్రిలో చేర్చారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version