AP pensions: ఏపీలో కలకలం…పెన్షన్ డబ్బులు మిస్సింగ్ అయ్యాయి. పల్నాడు పరిధి వినుకొండ లో పెన్షన్ డబ్బులు మిస్సింగ్ అయ్యాయి. బ్యాంక్ నుంచి తెచ్చిన పెన్షన్ డబ్బులు లో లక్ష రూపాయలు మాయమైనట్లు ప్రచారం జరుగుతోంది. నిన్న ఒక బ్యాంకు నుంచి నగదు డ్రా చేసుకొని తీసుకువచ్చారట సచివాలయ సిబ్బంది.
కానీ పెన్షన్లు కోసం, సచివాలయ సిబ్బందికి పంపిణీ చేసే సమయంలో లక్ష రూపాయలు, తేడా ఉన్నట్లు గుర్తించింది సిబ్బంది. ఇక నగదు ఎక్కడ మాయం అయిందో అని ఆరాతీస్తున్నారు సచివాలయ ఉద్యోగులు. అయితే.. ఈ విషయం బయటకు రావడంతో.. పెన్షన్ డబ్బులు మిస్సింగ్ అయ్యాయని ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక అటు నేడు అన్నమయ్య జిల్లాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రానున్నారు. రాయచోటి నియోజకవర్గంలోని సంబేపల్లి మండలంలో పర్యటించనున్నారు చంద్రబాబు. సంబేపల్లిలో జరిగే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పెన్షన్లను పంపిణీ చేయనున్న సీఎం చంద్రబాబు.