మొబైల్ చూస్తూ.. ఏపీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షలో కాపీయింగ్

-

ఏపీలో ఖాళీగా ఉన్న 92 పోస్టుల భర్తీకోసం ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌-1 ప్రాథమిక పరీక్షలో కాపీయింగ్ జరిగింది. విజయవాడ బెంజి సర్కిల్‌లోని నారాయణ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో కాపీయింగ్‌ వెలుగు చూసింది. ఉదయం నిర్వహించిన ప్రిలిమ్స్‌ పరీక్షకు పోరంకి సచివాలయంలో పనిచేస్తున్న కొల్లూరు వెంకటేశ్‌ అనే అభ్యర్థి ఏకంగా మొబైల్‌ తీసుకొచ్చాడు. మొబైల్‌లో గూగుల్‌ ఓపెన్‌ చేసి జవాబులు చూసి రాస్తుండగా అధికారులు గుర్తించారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

8 జిల్లాల్లో 297 పరీక్షా కేంద్రాలను ఏపీపీఎస్సీ ఏర్పాటు చేసింది. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు పేపర్‌-1 పరీక్ష, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు పేపర్‌-2 పరీక్ష నిర్వహించారు. ఈసారి పేపర్‌-1 పరీక్ష తీరుపై అభ్యర్థుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది. పలు ప్రశ్నలు ఎక్కువ నిడివితో ఇచ్చారని, చదవి అర్థం చేసుకునేందుకే ఎక్కువ సమయం పట్టిందని అభ్యర్థులు తెలిపారు. ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు తక్కువ సమయం మిగిలిందని తెలిపారు. గ్రూప్‌-1 ఉద్యోగాలకు మొత్తం 1,26,449 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version