రేపు పోలవరం ముంపు ప్రాంతాల్లో పర్యటించనుంది సిపిఐ ప్రతినిధి బృందం. వరదలతో అతలాకుతలమైన ప్రాంతాల్లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ నేతృత్వంలోని బృందం రేపు (ఆగస్టు 3) వ తేదీన పోలవరం ముంపు ప్రాంతాల్లో పర్యటించనుంది. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే ప్రతిఏటా వరదల్లో చిక్కుకొని పోలవరం నిర్వాసితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా పోలవరం నిర్వాసితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పోలవరం నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇచ్చి వారికి వెంటనే ఇల్లు నిర్మించి పునరావాసము కల్పించాలన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తామని వెల్లడించారు.