ఎన్నికల కమిషనర్ వ్యవహారం అనేది పూర్తిగా రాజ్యాంగబద్దమైన వ్యవహారం. ఈ విషయంలో రాజకీయ పార్టీల జోక్యం ఏమాత్రం సహేతుకం కాదు! ఈ క్రమంలో ఏపీలో ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ నియామకంపై ఏపీ సర్కార్.. తనకున్న అభ్యంతరాలను హైకోర్టులో చెప్పుకుంది. వ్యవహారం సుప్రీం కోర్టు వరకూ వెళ్లనుంది! దీంతో ఈ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం, నిమ్మగడ్డ మినహా ఇంకెవరూ స్పందించే పనికి పూనుకోవడం లేదు. ఈ క్రమంలో ఏపీలోని రాజకీయ పక్షాలు మాత్రం వారి వారి డిమాండులు వారు చేసేస్తున్నారు.
ఈ విషయంలో హైకోర్టు తీర్పు అనంతరం సుప్రీం కు వెళ్తామని ఏపీ సర్కార్ ప్రకటించిన వైనం. ఈ సమయంలో కూడా తమ పరిధి దాటి మాట్లాడటమో ఏమో కానీ.. ఏపీలోని ఇతర రాజకీయ పార్టీలు ఈ విషయంలో తెగ డిమాండ్లు చేసేస్తున్నాయి. ఎన్నిల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ ను కొనసాగించాలని సీపీఐ నేత రామకృష్ణ డిమాండ్ చేస్తున్నారు. నిమ్మగడ్డ ను ఎట్టిపరిస్థితుల్లోనూ కొనసాగించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కోర్టు తీర్పు తర్వాత.. ఆ తీర్పు సారాంశం పూర్తిగా అర్ధం కాకో లేక అత్యూత్సాహమో కానీ… నిమ్మగడ్డ రమేష్ వ్యవహరించిన తీరుపై ఏజీ శ్రీరాం క్లారిటీ ఇస్తే.. అది కూడా దుసంప్రదాయం అని మైకులముందుకు వచ్చేస్తున్నారు టీడీపీ నేతలు!
అసలు ఎన్నికల కమిషనర్ ఎవరైతే రాజకీయపార్టీలకు ఏమిటి? పార్టీలకు ఎన్నికల్లో అవకతవకలు జరగకుండా నిర్వహించబడటం కావాలి.. ప్రజలకు ఎన్నికలు ప్రశాంతంగా జరగడం కావాలి! ఇది పూర్తిగా ఎన్నికల కమిషనర్ చేతిలో ఉండటంతో పాటు ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీల చేతిలో కూడా ఉంటుందనే చెప్పుకోవాలి. ఈ క్రమంలో ఎన్నడూ లెని విధంగా… ఏపీ సర్కార్ సుప్రీం కు వెళ్లడం అనవసరం, అది మొండితనపు చర్య.. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ నే ఎన్నికల కమిషనర్ గా కొనసాగించాలని అని ప్రతిపక్షాలు డిమాండ్ చేయడం ఏమిటో.. సామాన్యుడికి అర్ధం కావడం లేదు! రమేశ్ కుమార్ నియామకంపై వీరి అత్యుత్సాహం ఏమిటో అస్సలు అర్ధం కావడం లేదు!