ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. తాజాగా ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ పోలీసుల కోసం 2వేలకు పైగా కొత్త వాహనాలు కొనుగోలుకు నిధులు మంజూరు చేశామని తెలిపారు. పోలీస్ శాఖకు వైసీపీ ప్రభుత్వం పెట్టిన బకాయిలను త్వరలోనే రిలీజ్ చేస్తామని తెలిపారు. సైబర్ నేరాల కట్టడికి ప్రతీ జిల్లాలో ఓ సైబర్ పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాజకీయ ముసుగులో నేరాలు చేసే వాళ్లను వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
భవిష్యత్ లో ఎవరైనా ఆడబిడ్డల జోలికి వస్తే ఏం చేయాలో చేసి చూపిస్తామన్నారు. దేశమంతా అధ్యయనం చేసి మహిళల భద్రతకు చట్టాలు చేశామన్నారు. గత ప్రభుత్వం ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. అందులో వైసీపీ వాళ్లనే ఉద్యోగులుగా నియమించారు. వారిచేత అసభ్యంగా పోస్టులు పెట్టించారని తెలిపారు. గత ఐదేళ్లలో దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా దాని మూలాలూ ఏపీలోనే ఉండేవని.. గతంలో డ్రగ్స్ కి వ్యతిరేకంగా పోరాడితే టీడీపీ కార్యాలయం పై దాడి చేశారని వెల్లడించారు.