వైద్య విద్యార్థులు డీప్ టెక్ వంటి టెక్నాలజీ పై పట్టు సాధించాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవానికి ఆయన రాష్ట్రపతితో పాటు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రోగులు తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప ఆసుపత్రులకు రాకుండా వైద్య చికిత్స అందించేలా వైద్య రంగాన్ని టెక్నాలజీతో తీర్చిదిద్దాలన్నారు. మంగళగిరి ఎయిమ్స్ లో స్నాతకోత్సవానికి రాష్ట్రపతి, సీఎం హాజరయ్యారు. ఇందులో రోగులకు రూ.10కే వైద్య సేవలు అందుతున్నాయని.. మరో 10 ఎకరాలు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
వైద్య వృత్తిని ఎంచుకోవడం అంటే విద్యార్థులు మానవత్వంతో సేవ చేసే దారిని ఎంచుకున్నారనే చెప్పవచ్చు. ప్రజల ప్రాణాలు కాపాడి వారి ఆరోగ్యం మెరుగు పరిచే అద్భుతమైన అవకాశం మీకు వస్తుందని.. యువ వైద్యులు, గ్రామీణ, గిరిజన, మారుమూల ప్రాంత ప్రజలకు సేవ చేసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. చిత్త శుద్దితో పని చేసి దేశ ఆరోగ్యాభివృద్ధిలో పాలు పంచుకుంటారని ఆశిస్తున్నట్టు తెలిపారు సీఎం చంద్రబాబు.