గంజాయి గురించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభించిన అనంతరం ప్రసంగించారు. ప్రస్తుతం చిన్న చిన్న ప్రాంతాల్లో గంజాయి ఎక్కువైపోయింది. కొకైన్ ఎక్కువైంది. ఇవి వేగంగా తెలంగాణను ఆక్రమించుకుంటాయి. ఓనాడు ఉద్యమాలకు నిలువైన కాలేజీలు.. ఇప్పుడు ఉద్యోగం, ఉపాధి లేక వీటి వైపు బానిసలు అవుతున్నారు. త్వరలోనే పంజాబ్ ని చేరుకునే అవకాశం ఉంది. తెలంగాణ 1 ట్రిలియన్ డాలర్ ఎకానమీకి చేరుకోవాలంటే యువతకు ఉద్యోగం, స్వయం ఉపాధి కల్పించాలని రాజీవ్ యువ వికాసం పథకం తీసుకొచ్చామని తెలిపారు.
రాజీవ్ యువ వికాసం పథకం కేవలం అర్హులకే పథకాలు ఇవ్వాలని.. ప్రభుత్వం మీద విశ్వాసం కలగాలని సూచించారు. ఆరోపణలు లేకుండా ఉద్యోగాలు ఇచ్చాం. ఆరోపణలు లేకుండా ఉపాధ్యాయులను బదిలీలు చేశామని గుర్తు చేశారు. కలెక్టర్ ని బదిలీ చేయడం ఈజీ.. కానీ ఉపాధ్యాయుడిని బదిలీ చేయడం కష్టం అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మన వెంట ఉన్న వాల్లకు పథకాలు ఇవ్వడం కాదు.. పొలిటికల్ పోస్టులు ఇవ్వండి అని సూచించారు.