Demolition of YSR Congress Party office under construction in Tadepalli: తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కూల్చివేసింది కూటమి ప్రభుత్వం. ఇవాళ ఉదయం 5:30 గంటల సమయంలో కూల్చివేత ప్రారంభించారు. పొక్లైన్లు, బుల్డోజర్లతో భవనం కూల్చివేశారు. శ్లాబ్‌కు సిద్ధంగా ఉన్న భవనాన్ని కూల్చివేస్తున్నారు ఏపీ సర్కార్ అధికారులు. కూల్చివేతకు సీఆర్డీయే ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్‌ను సవాల్‌చేస్తూ నిన్న హైకోర్టును కోర్టును ఆశ్రయించింది వైయస్సార్‌సీపీ.
చట్టాన్ని మీరి వ్యవహరించ వద్దని హైకోర్టు ఆదేశించింది. సీఆర్డీయే కమిషనర్‌కు హైకోర్టు ఆదేశాలను తెలియ జేశారు వైయస్సార్‌సీపీ న్యాయవాది. అయినప్పటికీ కూడా తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కూల్చివేసింది కూటమి ప్రభుత్వం. ఇక ఈ తరుణంలోనే హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ వైయస్సార్‌సీపీ కార్యాలయభవనాన్ని కూల్చివేశారంటున్న వైయస్సార్‌సీపీ…. కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని, హైకోర్టు దృష్టికి తీసుకెళ్తామంటున్నారు.