తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు

-

తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

Big alert for people of Telangana Heavy to very heavy rains today

హన్మకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, మల్కాజిగిరి, సూర్యాపేట జిల్లాలో పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు కురుస్తాయంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాగా, ఇప్పటికే హైదరాబాద్ సహా పలుచోట్ల అర్ధరాత్రి నుంచి వర్షం కురుస్తోంది.

నగరంలోని గచ్చిబౌలి, మాదాపూర్‌, రాయదుర్గం, షేక్‌పేట, ఖైరతాబాద్‌, పంజాగుట్ట, లక్డీకపూల్‌, అమీర్‌పేట, రాజేంద్రనగర్‌, అత్తాపూర్‌, కిస్మత్‌పురా, ఎస్సార్‌నగర్‌, ఎర్రగడ్డ, యూసఫ్‌గూడ, లంగర్‌హౌస్‌, గండిపేట్‌, శివరాంపల్లి, ఎల్బీనగర్, మన్సూరాబాద్, నాగోల్, బీఎన్‌రెడ్డినగర్, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్‌మెట్‌ ప్రాంతాల్లో జోరుగా వర్షం కురిసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version